telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్టీల్‌ ప్లాంట్‌ : పవన్‌ కళ్యాణ్‌పై గంటా సంచలన వ్యాఖ్యలు !

Ganta srinivas tdp

ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని… జనం ఆందోళనలో ఉంటే బీజేపీ కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు. 100 శాతం స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నామని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారని.. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగానే ఆర్ధిక మంత్రి స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. పోస్కో, NMDC,RINLమధ్య వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందని ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి రాతపూర్వకంగానే చెప్పారని తెలిపారు. ప్రయివేటీకరణ విధానంతో పాటు మానవత్వం ఉండాలని.. ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగుల భద్రత, ప్లాంట్ భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు గంటా. బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడ్డంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాన్ కు ఎక్కువ బాధ్యత, హక్కు ఉందని… పవన్ కళ్యాణ్ నేరుగా పోరాటం ప్రకటించాలి… స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు సిద్ధపడాలని కోరారు. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాపై నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందన్నారు.

Related posts