telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

గంటాకు దళితరత్న అవార్డు ..

ganta srinivas got dalit ratna award

గంటా శ్రీనివాస్ కు, ఎర్రగడ్డకు చెందిన దళిత సంఘాల నాయకుడు, దళిత రత్న అవార్డు లభించింది. బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గంటా శ్రీనివాస్ తో పాటు పలువురికి దళిత రత్న అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు అందుకున్న గంటా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దళితులకు సేవలనందిస్తున్న 200ల మందికి ఈ అవార్డులను అందజేశారని తెలిపారు. తెలంగాణ దళిత సేన గ్రేటర్‌ హైదరాబాద్‌ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న తాను పలు దళిత సంఘాల్లో పదవులు నిర్వహించానన్నారు.

గంటా, తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు ఈ అవార్డు అందించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రామ్‌ లక్ష్మణ్‌, ఆలిండియా దళిత సేన జాతీయ చైర్మన్‌ జె.బి.రాజు, తెలంగాణ రాష్ట్ర కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంటా మల్లేష్‌, దళిత సంఘాల నాయకులు మేడి పాపయ్య, దండు సురేందర్‌, ఆలె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts