telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం .. : సౌరవ్‌ గంగూలీ

ganguly on icc world cup finals

మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో వారి పాత్ర కీలకం కాబట్టి ప్రస్తుత విరామం తాత్కాలికమనే భావిస్తున్నట్టు చెప్పాడు. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా సిరీసుల్లో వారిని పక్కనపెట్టి టీమిండియా కొత్త వారికి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత జట్టు బాగుంది. మణికట్టు మాంత్రికులను విరాట్‌ ఈ ఫార్మాట్లోకి తిరిగి తీసుకురావాలి. ఇతరులకు అవకాశం ఇచ్చేందుకే యుజువేంద్ర చాహల్‌కు విశ్రాంతినిచ్చారని అనుకుంటున్నా. లేదంటే అతడు టీ20 ఫార్మాట్లో తప్పనిసరిగా ఉండాలి. భారత్‌కు ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు అవసరం లేదు. త్వరలోనే టెస్టు సిరీస్‌ ఆరంభం అవుతుంది.

టీమిండియా విపరీతంగా టర్న్ అయ్యే పిచ్‌లపై కాకుండా మంచి వాటిపై ఆడుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి వికెట్‌పై జట్టు బాగా ఆడుతోందని గంగూలీ అన్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. చాలా మంది తమ అభిప్రాయాలు, సలహాలు చెబుతుంటారు. జట్టులో కీలకమైన విరాట్‌ కోహ్లీ దీర్ఘకాలం ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. బ్యాటింగ్‌ డెప్త్‌ పెరగడమే కుల్‌దీప్‌, చాహల్‌కు చోటుదక్కక పోవడానికి అసలు కారణం. దేశవాళీ, ఐపీఎల్‌లో రెండేళ్లుగా రాణిస్తున్న ఆటగాళ్లకు క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. ఒక కూర్పుకే అతుక్కుపోకుండా అత్యుత్తమ కూర్పు కోసం ప్రయత్నించాలని దాదా అన్నారు.

Related posts