telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

పాక్ తో మ్యాచ్ పై బేదాబిప్రాయాలతో.. సచిన్, గంగూలీ.. !!

ganguly and sachin on match with pak

పుల్వామా ఘటనతో భారత్ పాక్ మధ్య పూర్తిగా అఘాదం ఏర్పడినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న ప్రపంచ కప్ పై ఈ ఉగ్రదాడి ప్రభావం పడింది. ఈ టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తేలింది. దీనితో ప్రపంచ కప్ లో పాక్ తో జరిగే మ్యాచ్ ను భారత్ నిషేధించాలని మాజీలు, అభిమానులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ డిమాండ్ ను సచిన్ వ్యతిరేకించారు. పాక్ తో మ్యాచ్ ఆడకుంటే భారత్ రెండు పాయింట్లు కోల్పోతుందని…అప్పుడు పాకిస్థాన్ మ్యాచ్ ఆడకుండానే గెలిచినట్లవుతుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పుడూ పాక్ పై భారతే పైచేయి సాధించిందని గుర్తుచేసిన సచిన్…అలా మరోసారి చిత్తుగా ఓడించే అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు.

అయితే సచిన్ వ్యాఖ్యలపై తాజాగా టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాస్త ఘాటుగా స్పందించారు. సచిన్ కేవలం రెండు పాయింట్లు కోసమే చూస్తున్నాడని….కానీ తాను భారత్ ప్రపంచ కప్ ట్రోపీ అందుకోవాలని కోరుకుంటున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. 10 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ప్రతి జట్టు మిగతా దేశాలతో ఆడుతుందని అన్నారు. కేవలం ఒక్క మ్యాచ్ ను ఆడకుండా ఉంటే భారత్ కు నష్టమేమీ ఉండదంటూ గంగూలీ సచిన్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.

Related posts