• Home
  • వార్తలు
  • చంద్రబాబు వారెంట్‌పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే
రాజకీయ వార్తలు వార్తలు

చంద్రబాబు వారెంట్‌పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే

TRS Leader Gangula fire to BJP

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మాబాద్‌ కోర్టు వారెంట్‌ జారీ చేయడంపై కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పందించారు. కోర్టు జారి చేసిన అరెస్ట్‌ వారెంట్‌ను కూడా టీడీపీ రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. బాబ్లీని అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు తాను పోరాటం చేశానని చెప్పారు. ఈ కేసులో ఏ2గా ఉన్న తనపై 18 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఏనాడూ కేసులను పబ్లిసిటీ కోసం తాను వాడుకోలేదని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సహా, కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతలపై ఎన్నో కేసులను పెట్టారని, చంద్రబాబులా వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నడూ వాడుకోలేదని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కేసులను టీడీపీ వాడుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు టీడీపీని తిరస్కరించడం ఖాయమన్నారు.

Related posts

ఖంగుతిన్న కేసీఆర్… సర్వేలు అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా…

chandra sekkhar

పక్కా సమాచారంతో కాల్పులు… ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

nagaraj chanti

విడాకులు తీసుకున్న భార్యపై అత్యాచారం..మాజీ భర్తకు పదేళ్ల జైలు

madhu

Leave a Comment