telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిల పార్టీపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్‌ అభిమానులతో సమావేశమవుతున్నారు. అయితే షర్మిల తొలి సమావేశం నిర్వహించిన రోజు నుంచే.. ఆమెపై విమర్శల దాడి ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో పక్కరాష్ట్రాల వారి అవసరం లేదని అధికారపార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు.  అయితే తాజాగా సభ్యత్వ నమోదులో మంత్రి గంగుల కమలాకర్ షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలకు అవకాశం లేదని చురకలు అంటించారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం కెసిఆర్ స్థాపించిన టిఆర్ఎస్‌నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని… టిఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. సీఎం కెసిఆర్ తెలంగాణ ఆస్తి అని… కరీంనగర్ నియోజకవర్గంలో 60 వేల వరకు సభ్యత్వ నమోదు పూర్తందని పేర్కొన్నారు. కరీంనగర్ లో టార్గెట్ కు మించి సభ్యత్వ నమోదు జరిగిందని… రైతులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని తెలియజేశారు.

Related posts