telugu navyamedia
క్రీడలు క్రైమ్ వార్తలు

క్రికెటర్ భార్య, నటిపై అటాక్ 

Gang robs, assaults actress Farheen Prabhakar in Delhi
ప్రముఖ మాజీ క్రికెటర్  ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి ఫర్హీన్ పై ఢిల్లీలో దాడి జరిగింది. ఢిల్లీలో ఉన్న సర్వప్రియ విహార్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ కి వెళ్లారు ఫర్హీన్. ఆ తరువాత తన కారులో ఇంటికి బయలుదేరి, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా… తక్ తక్ గ్యాంగ్ కి చెందిన నలుగురు దొంగలు ఆమె కారుని చుట్టుముట్టి, డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయడం రాదంటూ ఆమెను దూషిస్తూ ఫర్హీన్ దగ్గరున్న పర్సు, మొబైల్ ఫోన్ లాక్కుని, కొన్ని డాక్యుమెంట్లను తీసుకుని పారిపోయారు. దొంగలు దాడి చేసిన సమయంలో ఫర్హీన్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు… కానీ ఆమెకు ఆస్తమా ఉండడంతో ఆ వాదులాటలో ఆమె రోడ్డుపై పడిపోయారు. అనంతరం ఓ ఆర్మీ ఆఫీసర్ సహాయంతో ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేశారు ఫర్హీన్. తన పర్సులో 16 వేల రూపాయల నగదు, కొన్ని డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ ఉన్నాయని పోలీసులకు వెల్లడించారు ఆమె. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మీద దాడి జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తక్ తక్ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts