• Home
  • వార్తలు
  • భర్తపై దాడిచేసి అతనిముందే… వివాహితపై సామూహిక అత్యాచారం…!
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు

భర్తపై దాడిచేసి అతనిముందే… వివాహితపై సామూహిక అత్యాచారం…!

Gang rape

దేశంలో మహిళలపై రోజు రోజుకు లైంగిక వేధింపులు, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.. నిందితులను ఎంత కఠినంగా శిక్షించినప్పటికి తప్పుడు పనులు చేసే వారిలో ఎలాంటి మార్పులు కనపడటం లేదు.. వీటన్నింటికి అడ్డుకట్ట పడేదెప్పుడు… దేశంలో మహిళలు ప్రశాంతంగా అర్ధరాత్రి కూడా నడి రోడ్డుపై తిరిగే రోజులొస్తాయా…ఇలా ఉంటే ఇంకెలా వస్తాయి… ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకొని వస్తున్న దంపతులపై దాడిచేసి భర్తను తరిమికొట్టి కొట్టి మరి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు…

ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో ఇద్దరు 17ఏళ్ల మైనర్ బాలురు కూడా ఉండటం గమనార్హం.. వివరాలు ఆప్రకారం… చెన్నై తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి మూడు నెలల క్రితమే ప్రేమించిన యువతి(29)తో వివాహం జరిగింది.. కాగా బుధవారం రోజున దంపతులిద్దరూ గుమ్మిడిపూండి గ్రామ సమీపంలోని ఆలయానికి వెళ్లివస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలతో నలుగురు యువకులు ఆ దంపతులిద్దరిని అడ్డుకొని భర్తపై దాడిచేశారు.. అనంతరం భార్యకు మెడపై కత్తి పెట్టి ఆమెను ఎత్తుకొని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు..

కాగా ఆమె భర్తకు తీవ్ర గాయాలవడంతో ఉరుకులు పరుగులమీద సమీపంలోని గ్రామస్తుల వద్దకు చేరి వారిని వెంటపెట్టుకొని వస్తున్న సమయానికి ఆ నలుగురు దుండగులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి అక్కడినుంచి పారిపోయారు… దీనితో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే ప్రాంతానికి చెందిన మోహన్, మునియస్వామిలుగా గుర్తించారు.. అలాగే ఈ ఇద్దరితో పాటుగా 17 ఏళ్ల వయసుగల ఇద్దరు బాలురు నిందితులని తేలింది.. దీనితో నలుగురిని గురువారం రోజున అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారు…

Related posts

స్వరా భాస్కర్ పై చాకొలేట్ దర్శకుడి ఆగ్రహం.. అందులోంచి ఖాతా తొలగింపు

nagaraj chanti

భర్తలేని మహిళలే టార్గెట్..ఆర్మీ మేజర్.. పదుల సంఖ్యలో పెళ్లిళ్లు, లక్షల్లో మోసాలు…!

nagaraj chanti

మీటూ ఎఫెక్ట్ : సెలబ్రిటీ మేనేజర్ ఆత్మహత్యాయత్నం

vimala t

Leave a Comment