• Home
  • వార్తలు
  • రాష్ట్రపతి అవార్డు తీసుకున్న యువతిపై గ్యాంగ్ రేప్.. కేసు నమోదు చేయమన్న పోలీసులు..!
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

రాష్ట్రపతి అవార్డు తీసుకున్న యువతిపై గ్యాంగ్ రేప్.. కేసు నమోదు చేయమన్న పోలీసులు..!

Dehradun Boarding School Girl gang rape 5 Teachers 4 Seniors Arrest

దేశంలో మహిళలపై రోజు రోజుకు లైంగిక వేధింపులు, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి.. నిందితులను ఎంత కఠినంగా శిక్షించినప్పటికి తప్పుడు పనులు చేసే వారిలో ఎలాంటి మార్పులు కనపడటం లేదు.. వీటన్నింటికి అడ్డుకట్ట పడేదెప్పుడు… దేశంలో మహిళలు ప్రశాంతంగా అర్ధరాత్రి కూడా నడి రోడ్డుపై తిరిగే రోజులొస్తాయా… ఇలా ఉంటే ఎలా వస్తాయి… సిబిఎస్ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచినా 19 ఏళ్ల యువతిపై కొంతమంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు… మరో విచిత్రమేంటంటే పిర్యాదు చేయడానికై పోలీస్ స్టేషన్ కి వెళితే పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదట.. వివరాల ప్రకారం…

హర్యాణా రాష్ట్రంలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి ఓ ప్రముఖ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.. కాగా సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచిన ఈ యువతికి రాష్ట్రపతి సత్కారం కూడా లభించింది… కాగా గురువారం రోజున కోచింగ్ కోసమని వెళ్లిన ఆ యువతిని కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి పొలాల్లోకి తీసుకెళ్లి సదరు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లి విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయగా మొదట పోలీసులు పిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారని..

Gang Rape on 19 Years Girl Who Has CBSE topper in Haryana

అనంతరం మరొక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేయవలసి వచ్చిందని.. ఖచ్చితంగా ఈ దుర్మార్గానికి పాల్పడిన వారి వెనుక పెద్దల హస్తముందని బాధితురాలికి తగిన న్యాయం చేయాలని కొందరు స్థానికులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి… కాగా బాధిత మహిళా పిర్యాదు మేరకు గాను జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలుపగా ఈ కేసును మహేంద్రగఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. విచారణ అనంతరం ఈ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తామని న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు…

Gang Rape on 19 Years Girl Who Has CBSE topper in Haryana

కాగా ప్రాథమిక విచారణలో కోచింగ్ కి వెళుతున్న బాలికను ముగ్గురు గుర్తుతెలియని యువకులు ఎత్తుకెళ్ళి స్థానిక పొలంలో అప్పటికే మరికొందరు యువకులు ఉండి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది…

Related posts

కర్ణాటక మంత్రి మహాదేవప్పకు ఐటీశాఖ ఝలక్

admin

భారతీయ ప్రతిభకు…మరోసారి అమెరికా భారీ వేతనంతో…ఉద్యోగం..

chandra sekkhar

మానవ సేవే మాధవ సేవ : వంశీ రామరాజు

admin

Leave a Comment