telugu navyamedia
telugu cinema news trending

“గ్యాంగ్ లీడర్” మొదటిరోజు వసూళ్లు… ఏరియాల వారీగా…

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రూ.21కోట్లకు మార్కెట్ చేశారు. మొదటిరోజే దాదాపు నాలుగున్నర కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది.. ఇంకా శని, ఆదివారాల్లో సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఓవరాల్ గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.57 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఏరియాల వారీగా సినిమా కలెక్షన్స్..

నైజాం – రూ.1.67 కోట్లు
సీడెడ్ – రూ.0.52 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.0.62 కోట్లు
ఈస్ట్ – రూ.0.52 కోట్లు
వెస్ట్ – రూ.0.30 కోట్లు
కృష్ణ – రూ.0.33 కోట్లు
గుంటూరు – రూ.0.46 కోట్లు
నెల్లూరు – రూ.0.15 కోట్లు

Related posts

ఆదివారం గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు

vimala p

మహిళకు భయంకర అనుభవం… 6 రోజులు నరకం

vimala p

పడుకుంటేనే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

vimala p