telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గణేష్ ఉత్సవాలకు … చురుగ్గా ఏర్పాట్లు… ఈసారి భారీ భద్రత..

ganesh utsav arrangements going well

గణేష్ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఖైరతాబాద్ గణేష్ కూడా ఉత్సవానికి సిద్ధం అవుతున్నాడు. దే్శంలోనే అత్యంత ఎత్తైన వినాయకున్ని రూపొందించడం, 11రోజులు పవిత్ర పూజలందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేర్చే వరకూ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. సుమారు 25లక్షల మంది భక్తులు ఖైరాతా బాద్ వినాయకున్న దర్శించుకుంటారని, ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని గణేష్ ఉత్సవ సమితి ఉపాద్యక్షులు మహేష్ యాదవ్ చెప్పుకొచ్చారు.

ఈసారి తొలిరోజు పూజలు నిర్వమించేందుకు గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించబోతున్నట్టు యాదవ్ తెలిపారు. ముఖ్యంగా ఈ పందకొండు రోజుల పాటు, విద్యుత్, జీహెచ్ఎంసీ, ఆర్ ఆండ్ బీ, హెఎండీఏ, రవాణా, పోలీస్, అటవీ శాఖల అదికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని మహేష్ తెలిపారు.

Related posts