telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వినాయక నిమజ్జనం రోజు మెట్రోలో వెళ్లండి..నగరవాసులకు  పోలీసుల విజ్ఞప్తి

special arrangements for ganesh utsav

హైదరాబాద్‌లో రేపు వినాయక నిమజ్జనోత్సవం జరగనుంది. దీంతో నగరవాసులు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ లలో ప్రయాణించాలని పోలీసులు కోరుతున్నారు. ఆ రోజు గణపతి విగ్రహాలను తరలించే వాహనాలు మినహా ఇతర వాహనాలకు ర్యాలీ వెళ్లే మార్గాల్లో అనుమతి ఉండదు. లారీలు, ఇతర భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు. వాటిని నిమజ్జనం పూర్తయ్యే వరకు నగర శివారు ప్రాంతాల్లో నిలిపేస్తారు.

ఇతర వాహనాలకు ఉన్న నిబంధనలే ఆర్టీసీ బస్సులకూ వర్తిసాయి. వివిధ పాయింట్ల వద్ద వాటిని కూడా మళ్లిస్తారు.నిమజ్జనోత్సవం తిలకించడానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం పలు కేంద్రాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు అదనపు సీపీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ప్రయాణికులు నెక్లె్‌సరోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌ రోడ్‌, ఇతర ప్రధాన ర్యాలీ వెళ్లే రోడ్‌లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Related posts