telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

వినాయక విగ్రహం తయారీలో అపశృతి.. కుప్పకూలిన మంటపం

vinayaka statue

వినాయక చవితి పండగ కోసం గణనాథుడి విగ్రహాలను వివిధ రూపాల్లో తయారు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ గణనాథుల ఏర్పాటుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న భారీ గణనాథుడి విగ్రహం తయారీలో అపశృతి చోటు చేసుకుంది.

నగరంలోని తాతయ్యపాలెంలో పవర్ యూత్ సంఘం సభ్యులు 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేసేందుకు సంకల్పించారు.ఇందుకోసం నిర్మిస్తున్న భారీ మంటపం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా మంటపం ఒక్కసారిగా కుప్పకూలింది.దీంతో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమయంలో మంటపం దగ్గర కార్మికులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Related posts