• Home
  • Trending Today
  • “గేమ్ ఓవర్” అంటున్న తాప్సి
Trending Today సినిమా వార్తలు

“గేమ్ ఓవర్” అంటున్న తాప్సి

game-over

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వైవిధ్యమైన కథలను ఎంచుకొని అద్భుతమైన హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది తాప్సి. ప్రస్తుతం ఈ మిల్కి బ్యూటీ ప్రధాన పాత్రలో వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా “గేమ్ ఓవర్”. గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘నయనతార’ ప్రధాన పాత్రలో నటించిన… తమిళ నాట ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న “మయూరి” వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ “గేమ్ ఓవర్” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురువారం చెన్నైలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయింది. సరికొత్త కథ, కథనాలతో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ రోజు నుంచి వరుసగా ఆంద్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలోని పలు అందమైన ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో తాప్సి గాయాలైన కాళ్ళకు గాట్లతో కన్పిస్తోంది. దీంతో ఈ చిత్రంపై సినీవర్గాల్లో ఆసక్తి మొదలైంది.

ఇటీవల తాప్సి, ఆదిపినిశెట్టి జంటగా నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి పాత్రకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

Related posts

#మీటూ లో అమితాబ్ నిజాలు కూడా త్వరలో బయట పడుతాయి… సప్నా

nagaraj chanti

గడియారం

chandra sekkhar

ప్రధానేనా.. ప్రక్షి రెట్టా… అంటున్న నటి రమ్య .. వైరల్

chandra sekkhar

Leave a Comment