telugu navyamedia
సినిమా వార్తలు

గేమ్ అఫ్ థ్రోన్స్ : చివరి సిరీస్ కు స్పెషల్ రన్ టైం

Game-of-Thrones

గేమ్ అఫ్ థ్రోన్స్ అభిమానులు ఫైనల్ వెబ్ సిరీస్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సిరీస్-8 త్వరలోనే వెబ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇందులో ఇదే చివరి సిరీస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ ఏకైక వెబ్ సిరీస్ కు ఉన్న అభిమానులంతా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ వెబ్ సిరీస్ చాలా ఇష్టం. ఏప్రిల్ 14 నుంచి మొదలుకానుంది ఈ సిరీస్. ఈసారి ప్రసారం కాబోయే సిరీస్ రన్ టైమ్ ఎప్పుడూ లేని విధంగా చివరి రెండు ఎపిసోడ్ లు 80 నిమిషాల వరకు ఉండడం గమనార్హం. HBO ఛానెల్ నిర్మించిన ఈ 18+ వెబ్ సిరీస్ ను ఇండియాలో హాట్ స్టార్ ప్రసారం చేస్తుంది.

ఎపిసోడ్ 1 : 54 నిమిషాలు

ఎపిసోడ్ 2 : 58 నిమిషాలు

ఎపిసోడ్ 3 : 60 నిమిషాలు

ఎపిసోడ్ 4 : 78 నిమిషాలు

ఎపిసోడ్ 5 : 80 నిమిషాలు

ఎపిసోడ్ 6 : 80 నిమిషాలు

Related posts