telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీడియా స్వేచ్ఛపై లోక్ సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియా స్వేచ్ఛపై లోక్ సభలో ప్రస్తావించారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను అణగదొక్కేలా ఏపీ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ జీవో విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని కార్యదర్శులకు ఇచ్చారని తెలిపారు.

మంత్రులు, అధికారులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెట్టడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఓ జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం ఉందని, దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Related posts