telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దుపై .. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్పందన ..

gajendra singh on polavaram tenders cancellation

పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దుపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ స్పందించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ఆయన ఈ అంశాన్ని గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో లేవనెత్తారు. దీనిపై సమాధానంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. టెండర్ల రద్దు ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా పడుతుందని చెప్పారు. టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.

ఈ ప్రాజెక్టులో నామినేషన్‌ ప్రాతిపదికపై నవయుగ, బెకం సంస్థలకు అప్పజెప్పిన టెండర్లను రద్దు చేసేందుకు రాష్ట్ర జలవనరులశాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. నామినేషన్‌ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. అయితే ఈ పనులను అప్పగించేందుకు కొత్తగా పిలవనున్న టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనవచ్చని చెప్పారు. పనులు వేగంగా చేయకపోవడం, ఇతరత్రా వేరే కారణాలతో ఈ సంస్థను తొలగించనందున పోలవరం ప్రాజెక్టుకు తాజాగా పిలిచే టెండర్లలో నవయుగ సంస్థ పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related posts