తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి గద్దర్?

Popular Singer Gaddar meet Rahul

ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకొంది. గజ్వేల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానంటూ గద్దర్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడే ఆయన ఓటు హక్కును కూడా నమోదు చేయించుకున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈరోజు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో గద్దర్ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గద్దర్ ను మాజీ ఎంపీ మధు యాష్కీ ఢిల్లీకి తీసుకెళ్లారని సమాచారం. మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదని గద్దర్ సన్నిహితులు చెబుతున్నారు. ఒక ఫౌండేషన్ కు సంబంధించి రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని వారు తెలిపారు. కాగా గద్దర్ ఖచ్చితంగా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

హరికృష్ణ మృతిపై…నాట్స్ నివాళులు…

chandra sekkhar

ఎంవీవీఎస్‌ మూర్తి సేవలు చిరస్మరణీయం: చంద్రబాబు

madhu

సోనియా విందు సమావేశం నేడే

admin

Leave a Comment