telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం: నారాయణ

Narayana cpi

హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటి పార్కు వద్ద వున్న ఫ్లైఓవర్ పై నుంచి అతివేగంతో దూసుకొస్తున్న కారు కింద పడిన దారుణ ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ను సీపీఐ బృందంతో కలిసి ఆ పార్టీ నేత నారాయణ పరిశీలించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫ్లైఓవర్ పై ఎక్కువ మలుపులు వున్నాయని, అందుకే, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

ఈ ఫ్లైఓవర్ ను పూర్తిగా పడగొట్టి మళ్లీ నిర్మించాలని, ఎక్కువ మలుపులు లేకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీ నిష్పక్షపాతంగా నివేదిక రూపొందించాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా న్యాయబద్ధంగా రిపోర్టు ఇవ్వాలని కోరారు.

Related posts