telugu navyamedia
సినిమా వార్తలు

స్కిట్ నా ఇష్టం… పేరు మీ ఇష్టం… : నాగబాబు

nagababu1

మెగా బ్రదర్ నాగబాబు “జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నాగబాబు “నా ఇష్టం” అంటూ యూట్యూబ్ ను ప్రారంభించి, తన విమర్శలను దీనిద్వారా కొనసాగిస్తున్నారు. తాజాగా “అంతా నా ఇష్టం” అంటూ యూట్యూబ్ లో ఓ స్కిట్ ను పోస్ట్ చేశారు నాగబాబు. ఈ వీడియోలో “హలో ఫ్రెండ్స్… వెల్ కమ్ టూ “మై ఛానెల్ నా ఇష్టం”. ఈరోజు చిన్నసైజ్ స్కిట్ ఒకటి చేస్తున్నాం.

ఎందుకంటే… జబర్దస్ట్ వాళ్లం కదా… అయితే ఈ స్కిట్ కు నేను పేరు పెట్టలేదు. కంటెంట్ నాది… పేరు మీది. మీకు నచ్చిన పేరు మీరు డిసైడ్ చేసి చెప్పండి. ఐ థింక్ యు ఎంజాయ్ దిస్ స్మాల్ స్కిట్. రెడీ టూ వాచ్” అంటూ ప్రారంభించారు. “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్… ఈరోజు మీకొక పరీక్ష పెట్టబోతున్నాను. 2019లో చాలా ఇంపార్టెంట్ పరీక్ష. ఈ పరీక్షలో మీ ఇద్దరూ డిస్టింక్షన్ తెచ్చుకోవాలని నా కోరిక… మీరు కనుక డిస్టింక్షన్ తెచ్చుకుంటే మన రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం. ఈరోజు టాపిక్ ఏంటంటే “నేను – నా అవినీతి”.

దానికి సంబంధించిన డీటైల్స్ మొత్తం రాయండి” అంటూ ఈ స్కిట్ లో ఉన్న ఇద్దరు యువకులను ఉద్దేశించి చెప్పారు. అందులో ఒకరి అధికారపక్షం, ఇంకొకరు ప్రతిపక్షం… అని వారికి అతికించి ఉన్న పేర్లను బట్టి తెలుస్తోంది. ఇక వీరిద్దరూ రాయడానికి లెక్కకు మించి అడిషనల్ పేపర్లు తీసుకోవడం గమనార్హం. ఈ విధంగా నాగబాబు అధికార పక్షం, ప్రతిపక్షాలపై పరోక్షంగా సెటైర్స్ వేశారన్నమాట. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts