telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోలవరానికి .. కేంద్రం నిధులు.. 1850 కోట్లు…

apcm visits polavaram today

ఇప్పటికే నిధులు కొరతతో ఇబ్బంది పడుతోన్న ఏపీకి కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1850 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జల వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) నుంచి రుణాలు తీసుకొని వాటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ) కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతాయి. ఇక తదుపరి బకాయిలు ఉన్న నిధులు విడుదల చేయాలంటే, ఎంవోయూ ప్రకారం పనులు జరుగుతున్నాయని..ఎలాంటి ఆలస్యం లేదని పోలవరం అథారిటీ కేంద్రానికి స్పష్టం చేయాల్సి ఉంటుంది. కాగా తాజాగా రిలీజ్ చేసిన డబ్బు రెండు రోజుల్లో ఏపీ గవర్నమెంట్‌కు చేరే అవకాశం ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ (జల వనరుల) ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ .5,600 ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆరు నెలల క్రితం కేంద్ర జల వనరుల మంత్రి పోలవరం కోసం రూ .3,000 కోట్ల మధ్యంతర విడుదల చేయాలని సిఫారసు చేశారు. ఇక ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ సైతం జాతీయ ప్రాజెక్టు పునారావాసం కోసం రూ .16 వేల కోట్ల నిధులు మధ్యంతర విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను రిక్వెస్ట్ చేశారు. కానీ కేంద్రం ప్రస్తుతం రూ.1850 కోట్లను మాత్రమే రిలీజ్ చేసింది. త్వరలో మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Related posts