telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి వేతనం!

tsrtc buses

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు జూన్‌ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నుంచి మే నెల వరకు సగం వేతనమే ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో జూన్‌ నెలకు సంబంధించి ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ మేరకు వారికి పూర్తి జీతాలు వచ్చాయి.

తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పూర్తి జీతం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థలో 49 వేల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీతాలకు సుమారు రూ.160 కోట్ల వరకు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో జూన్‌ నెలకు వందశాతం జీతాలు ఇవ్వనున్నారు.

Related posts