telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ దేశంలో ఎన్నికల హామీ నెరవేర్చకపోతే… ఎంపీలకు గుండుకొట్టి, బిచ్చమెత్తిచ్చి….

Mexico

సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తారు. తీరా ఎన్నికలు పూర్తయ్యాక వాటిని పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తారు. మన దేశంలో రాజకీయ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ దక్షిణ మెక్సికోలో ఎవరైనా రాజకీయ నేత హామీ ఇస్తే తప్పకుండా దానిని నెరవేర్చాల్సిందే. లేదంటే అక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారిని పట్టుకుని మహిళల దుస్తులు వేసి, గుండుకొట్టి ఊరేగిస్తారు. తాజాగా, జేవియర్ జిమెనెజ్, లూయిస్ టన్‌లకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వీరిని తీవ్రంగా అవమానించారు. మేయర్ అయిన జేవియర్, మునిసిపాలిటీలోనే మరో ఉన్నత పదవిలో ఉన్న లూయిస్‌లు ఎన్నికల సందర్భంగా నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి ఏకంగా 3 మిలియన్ పెసోలు (రూ.1,08 కోట్లు) కేటాయిస్తామని ప్రకటించారు. సమస్య పరిష్కారం అవుతుందన్న ఉద్దేశంతో ప్రజలు వారిని గెలిపించి అందలం ఎక్కించారు. అయితే, ఎన్నికయ్యాక నీటి సరఫరా సమస్యను పరిష్కరించకపోగా, అందుకు కేటాయిస్తామన్న నిధులను కాజేశారు. విషయం బయటకు రావడంతో ప్రజలంతా ఒక్కటై ఎంపీలు ఇద్దరిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బందీలుగా పట్టుకున్నారు. నాలుగు రోజులపాటు వారిని బంధించారు. అనంతరం వారికి మహిళల దుస్తులు తొడిగి ఊరేగించి బిచ్చమెత్తించారు. నిధుల దుర్వినియోగం నిజమని తేలితే గుండు కొట్టడం ఖాయమని హెచ్చరించారు. చివరికి పోలీసుల జోక్యంతో ప్రజలు వారిని విడిచిపెట్టారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ వారి చెరలోంచి ఎంపీలు బయటపడ్డారు.

Related posts