telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ పండుతో .. డెంగ్యూ కు దూరంగా..

fruit helps to overcome viral fevers

వానాకాలం వచ్చేసింది అంటేనే ఆసుపత్రులు నిండిపోతుంటాయి. ఆ స్థాయిలో విషజ్వరాలు వ్యాపిస్తుంటాయి. ఇది ప్రతి ఏటా జరిగే తంతు అయినప్పటికీ, దాని నుండి దూరంగా ఉండే ప్రయత్నాలు మాత్రం శూన్యమే అని చెప్పొచ్చు. ఇది కేవలం ఏదో గ్రామాలలో అనుకుంటే పొరపాటు, ఇవాళరేపు అభివృద్ధి పేరుతో మెట్రో స్థాయిలో ఉన్న నగరాలలో కూడా కాస్త వర్షం పడితేనే రోడ్లు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. దీనితో దోమలు వ్యాప్తి సునాయాసంగా జరిగిపోతుంది, దానితో జ్వరాలు కూడా తీవ్రంగా ప్రభలుతునే ఉన్నాయి. తాజా వర్షాలతో హైదరాబాద్ నగరం కూడా వరదలు వచ్చిన గ్రామంలా అయిపోయిందంటే .. ఇక జ్వరాల గురించి చెప్పాల్సిన పనేలేదు. అంత తీవ్రంగా ఒక నగర పరిస్థితి ఉంటె, ముందస్తు ఆరోగ్య జాగర్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ కాలంలో జ్వరాలు అదికూడా విషజ్వరాలు సైతం మనందరికి రాకుండా ఉండాలంటే శరీరంలో దానికి తగిన శక్తి ఉండాలని వైద్యులు చెపుతున్నారు. ఈ కాలంలో దొరికే బొప్పాయి ఇందుకు చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు.

సాధారణంగా డెంగ్యూ జ్వరం వస్తే బ్లడ్ ప్లేట్‌లెట్ల సమస్య తలెత్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ల సమస్య తగ్గుతుందట. బొప్పాయి పండులో ఉండే విటమిన్లు.. వేరే ఏ పండులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం 14 ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రోజు దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. బొప్పాయిలో విటమిన్ A,B,C,D,E లు అధికంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో ఒక్కసారిగా బొప్పాయి పండుకు డిమాండ్ పెరిగింది. మరోవైపు డెంగ్యూ వ్యాపించడం కూడా దీనికి ప్రధాన కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో బొప్పాయికి భారీగా డిమాండ్ ఏర్పడింది. మీరు బొప్పాయి తిని డెంగ్యూకి దూరంగా ఉండండి.

Related posts