telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అల వైకుంఠపురములో .. మొదటి లిరికల్ వీడియో..

frist song from alavaikuntapuramlo movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా అల వైకుంఠపురములో. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగె ఈ సినిమాలో బన్నీ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటి టబు, నవదీప్, నివేత పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, అక్కనేని సుశాంత్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాలోని సామజవరగమన అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమోని రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోమోను ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో, కాసేపటి క్రితం ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ని రిలీజ్ చేసారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఆ యూత్ ఫుల్ సాంగ్ కు ఎంతో ఆకట్టుకునే విధంగా సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల గారు. ప్రస్తుతం ఆ పాట, యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు!!

Related posts