telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాత్రి ప్రయాణం.. పోలీసు వాహనాలలో.. ఫ్రీగానే.. మహిళల కు మాత్రమే!

free ride to women in nights in

మహిళల భద్రత ప్రశ్నర్ధకంగా మారటంతో ఆయారాష్ట్రాలు సరికొత్త భద్రతా ఏర్పాట్లకు తెరతీస్తున్నాయి. తాజాగా, లుథియానా పోలీసులు తెచ్చిన కొత్త హెల్ప్‌లైన్‌కి కాల్ చేస్తే చాలు… సదరు మహిళ ఎక్కడుందో తెలుసుకొని… అక్కడకు PCR వెహికిల్ లేదా SHO వెహికిల్ పంపుతారు పోలీసులు. ఆ వాహనంలో ఫ్రీగా ప్రయాణిస్తూ భద్రత మధ్య ఇంటికి చేరుకోవచ్చు. ఈ సదుపాయాన్ని రాత్రి 10 గంటల నుంచీ ఉదయం 6 గంటల వరకూ కల్పిస్తున్నారు. దీనికి ఫ్రీ రైడ్ స్కీమ్ అనే పేరు పెట్టారు పంజాబ్ పోలీసులు. చాలా మంది లూథియానా మహిళలకు రాత్రి వేళ వాహనాలు దొరకట్లేదు. చీకటిపడే కొద్దీ ఏం జరుగుతుందోననే భయం. ఈ పరిస్థితి నుంచీ వారిని కాపాడేందుకు పోలీసులు ఫ్రీ రైడ్ హెల్ప్ లైన్ తేవడం గొప్ప విషయమే. పోలీసులు ఈ స్కీమ్ తేవడానికి ప్రధాన కారణం… ఈమధ్య హైదరాబాద్ శివార్లలో జరిగిన తెలంగాణ నిర్భయ దిశ అత్యాచారం, హత్య ఘటనే.

లుథియానాలో మహిళల రక్షణ కోసం చాలా చర్యలు చేపడుతున్నామన్న సీపీ రాకేష్ అగర్వాల్… 1091, 7837018555 హెల్ప్‌లైన్ నంబర్లు తెచ్చినట్లు తెలిపారు. వారమంతా ఇవి పనిచేస్తాయని వివరించారు. అలాగే… శక్తి యాప్ (Shakti App) ద్వారా… ఆపదలో ఉన్న మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు వీలవుతుందని వివరించారు. ఈ యాప్‌లో SOS ఫీచర్ ఉంటుంది. ఒక్క క్లిక్ చాలు… మొబైల్‌లోని 10 కాంటాక్టులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. సదరు మహిళ ఎక్కడున్నదీ ఆ మెసేజ్‌లలో ఉంటుంది. అలాగే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి కూడా సమాచారం వెళ్లిపోయింది. దాంతో వెంటనే మహిళల్ని పోలీసులు కాపాడేందుకు వీలవుతుంది. గత నెల్లో 2500 మంది మహిళలు ఈ యాప్ వేసుకున్నారు. ప్లే స్టోర్ నుంచీ దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Related posts