telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ : 15 నుంచి ఉచిత మోటివేషన్‌ కార్యక్రమాలు

క‌రోనా వ‌ల్ల ఎంతో మంది జీవితాలు ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని, ముఖ్యంగా విద్యార్థులు, యువ‌త మాన‌సిక స్థితిపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింద‌ని మేధా లాంగ్వేజ్ థియేట‌ర్ ఫౌండ‌ర్ అండ్ చీఫ్ కోచ్ డాక్ట‌ర్ అంబ‌ర‌గొండ చిరంజీవి అన్నారు. ఇలాంటి స‌మ‌యంలో వారికి అండ‌గా ఉండేందుకు, వారికి ప్రోత్సాహం అందించేందుకు ఉచిత మోటివేష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. హైద‌రాబాద్‌లో మాట్లాడిన ఆయ‌న‌.. యువ‌త‌కు కెరియ‌ర్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ఇంగ్లీష్ భాష ప్రాధాన్యం, సాఫ్ట్ స్కిల్స్ గురించి వివ‌రించ‌డం, కాన్ఫిడెన్స్ పెంచుకోవ‌డం..

వంటి అంశాల‌ను వివ‌రిస్తామ‌న్నారు. మారుతున్న కాలానికి త‌గిన‌ట్లుగా యువ‌త సిద్ధం అయ్యేందుకు, త‌ద్వారా అవ‌కాశాలు అందిపుచ్చుకునేలా మారేందుకు తాము తోడ్పాటునందిస్తామ‌న్నారు. దీని కోసం ఈనెల 15 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా మోటివేష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. పాఠ‌శాల‌లు, కాలేజీలు, ఉద్యోగ సంస్థ‌ల యాజ‌మాన్యాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు.. ఇలా ఎవ‌రైనా త‌మ‌ను సంప్ర‌దిస్తే తామే ఆ ప్రాంతాల‌కు వ‌చ్చి ఉచితంగా మోటివేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. దీని కోసం 9866006665 నెంబ‌ర్లో సంప్ర‌దించాల‌ని సూచించారు. అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Related posts