• Home
  • ఆరోగ్య వార్తలు
  • బట్టతలపై వెంట్రుకలు…సాధ్యం.. ఉచితం కూడా… : విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్ సామాజిక

బట్టతలపై వెంట్రుకలు…సాధ్యం.. ఉచితం కూడా… : విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి

free hair growth treatment on bold head by visaka kgh

నేటి జీవన విధానంలో సరిగా ఆహరం కూడా తీసుకోకుండా, ఏదో ఆకలి తీరడానికి తినేసి పని చూసుకునే తీరికలేని స్థితి వలన ప్రధానంగా పౌష్టికాహార లోపం, తద్వారా ఇతర శారీరక అసమానతలు తలెత్తుతున్నాయి. వాటిలో ప్రధమంగా బట్టతల. దీనిబారిన పడటానికి వయసు నిమిత్త మాత్రమే.. వయస్సు వారికైనా నేటి జీవన విధానంలో బట్టతల రావచ్చని వైద్యులే నిర్దారిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో జుట్టు ఉన్నంత కాలం నిర్లక్ష్యం చేసో, మరొకటో ఉన్నది కాస్తా ఇరవై ఏళ్ళు కూడా దాటకముందే రాలిపోతుంటే…అయ్యో నా జుట్టు అంతా రాలిపోతుంది అని అప్పుడు వైద్యుల చుట్టూ తిరికి లక్షలకు లక్షలు పోసి జుట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.. ఇది పచ్చి నిజం.

కానీ ఇక బట్ట తలపై జుట్టు కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి చర్మవ్యాధులు విభాగం అధికారులు చెపుతున్నారు. వీరు నెలకు 60 మందికి ఈ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. దీనికి వారు ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదు. మీరు ముందుగా వెళ్లి రిజిస్టర్ చేసుకోగానే మీ రక్త నమూనా సేకరించి దాస్తారు. మీకు ఒక డేట్ ఇస్తారు, అప్పుడు మీరు వెళ్ళాక మీ రక్త నమూనా నుండి సేకరించిన పీఆర్పీ ని జుట్టు రాలిన చోట ఇంజెక్ట్ చేస్తారు. అంతే కొన్ని వారాలలో మళ్ళీ జుట్టు మొలవటం మొదలవుతుంది. అయితే ఇలాంటి ఇంజక్షన్ ప్రక్రియ సమస్య తీవ్రతను బట్టి గరిష్టంగా 20 సార్లు, అంటే 20 సిట్టింగులలో చేస్తారు. వీటితో పాటు కొన్ని మందులు కూడా ఇస్తారు, వాటిని అనుగుణంగా వాడుతుండాలి.

free hair growth treatment on bold head by visaka kghఇదే వైద్యం బయట కూడా చేస్తారు, కానీ ఒక్కో ఇంజక్షన్ కు 2000 రూపాయలు వరకు వసూలు చేస్తారు. కానీ కింగ్ జార్జ్ లో ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ చికిత్స ముందు ప్రతి వ్యక్తికీ కొన్ని పరీక్షలు(మధుమేహం, హార్మోన్లు, కొవ్వు, ఫంగల్ ఇన్ఫెక్షన్) చేసి దానికి అనుగుణంగా వైద్యం చేస్తాము అని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ గురుప్రసాద్ తెలిపారు.

Related posts

మరో జల సమాధి…131 మంది…

chandra sekkhar

నాడు ఇందిరా.. నేడు చంద్రబాబు…అరుదైన ఘనత…వారిద్దరికే…

chandra sekkhar

టీబీ మందులను చౌకగా అందించేందుకు ప్రణాళిక: డబ్ల్యూ.హెచ్.ఓ

admin

Leave a Comment