telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

గ్రూప్స్ కోసం ఉచిత శిక్షణ .. దరఖాస్తులు ఆహ్వానం ..

free coaching for groups in telangana

అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్ 1 నుంచి 3 పౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు డైరెక్టర్ బాలాచారి తెలిపారు. స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం, పూర్తి నోటిఫికేషన్ లభించనుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 23వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు మించకూడదు. పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు రూ. 2 లక్షలకు మించకూడదని, ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలో హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేటలో పది బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

దరఖాస్తు దాఖలు చేయటకు పూర్తి వివరాలు TSBCSTUDYCIRCLES.CGG.GOV.INలో కానీ 040 24071178 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Related posts