telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పేద విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

nokia 3.2 and 2.2 smart phones with less prices

ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు శుభవార్త చెప్పింది. లాక్ డౌన్  నేపథ్యంలో షాపులు, రెస్టారెంట్లు  ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కానీ స్కూళ్లు, కాలేజీల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీంతో, పాఠశాలలు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలకు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లను కొనివ్వడం ఎంతో మంది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది.

ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత స్మార్ట్ ఫోన్ పథకం అందరు విద్యార్థులకు వర్తించదు. పేద విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఫోన్లను అందించనున్నారు.

Related posts