telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నటుడి తండ్రికి కరోనా పాజిటివ్

Freddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. అయినప్పటికీ కరోనా మాత్రం ఎవరినీ వదలడం లేదు. చిన్నపిల్లలు, పెద్దలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ‘టచ్ చేసి చూడు’ సినిమాలో ఇర్ఫాన్ లాలా పాత్రలో కనిపించిన బాలీవుడ్ నటుడు ఫ్రెడీ దారూవాలా తండ్రికి కరోనా పాజిటివ్‌ సోకింది. దీంతో ముంబై బీఎంసీ అధికారులు ఫ్రెడీ ఇంటికి సీలు వేసి, శుభ్రపరిచారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్నవాళ్లందరికీ కూడా టెస్టులు నిర్వహించారు. ఫ్రెడీ కూడా ఈ వార్తను మీడియా ఎదుట ధృవీకరించాడు. తన తండ్రి గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబు తదితర ఫ్లూ లాంటి లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఫ్రెడీ తండ్రి (67) కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు.

Related posts