telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఉగ్రవాది మసూద్ ఆస్తులు .. స్తంభింపజేసిన ఫ్రాన్స్ .. !

masud alive announced by his own

జైషే మహ్మద్ టెర్రర్ గ్రూపు అధినేత మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రవేయించడంలో భారత్ ఐరాసలో విఫలమైనా, ఫ్రాన్స్ మాత్రం తనవంతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో మసూద్ అజహర్ కు చెందిన ఆస్తులను స్తంభింపజేస్తున్నామంటూ ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి.

ఫ్రాన్స్ ఆర్థిక, ద్రవ్య విధానం అనుసరించి మసూద్ ఆస్తుల స్తంభనపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అంతేకాకుండా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజహర్ పేరు కూడా చేర్చేలా ఫ్రాన్స్ కృషి చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మసూద్ అజహర్ పై తీర్మానాన్ని చైనా వీటోతో కొట్టిపారేసిన కొన్నిరోజుల్లోనే ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకోవడం భారత్ కు గణనీయమైన విజయంగానే భావించాలి.

Related posts