రాజకీయ వార్తలు

అమరావతి నుండి మమ్మల్ని బదిలీ చేయించండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల జీవితాలను మార్చుతాను అంటున్నాడు. కానీ తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాదించుకోవడంలో మా వంతు కృషి చేశాము.  కానీ మా భార్య, పిల్లలను, తల్లిదండ్రులను  తెలంగాణాలో వదిలి అమరావతికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నాము.  మమ్మల్ని తెలంగాణాకి రప్పించడంలో ఎలాంటి చొరవ తీసుకోలేకపోతున్నారు. 
 
కానీ ఈ మధ్య దేశ ప్రజల జీవితాలను మార్చుతానటున్నావు . ముందు మా జీవితాలను మార్చండి. తర్వాత దేశ ప్రజల గురించి ఆలోచించండి. అని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న నాలుగవ తరగతికి చెందిన  233 మంది సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ లోని ఏపీ సచివాలయం ముందు నిరసనకు దిగారు. 
 
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తమను నాలుగు సంవత్సరాలు కావొస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఏనాడు  పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని రిలీవ్ చేయడానికి  ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకొని తెలంగాణ ప్రాంతానికి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
 

Related posts

కిడారికి పట్టిన గతే ఈశ్వరికి…మావోల లేఖ…అందుకే శిక్షించాం..

chandra sekkhar

కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే..మూడేళ్లకే పారిపోతాడు: విజయశాంతి

madhu

కేసీఆర్ కు మోత్కుపల్లి బంపరాఫర్..తనను వాడుకుంటే 12 సీట్లను గెలిపిస్తా!

madhu

Leave a Comment