telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మహిళతో నగ్న ఫోటో… ఎన్నారైకి బెదిరింపులు… చివరకు…!

honeytrap

కేరళకు చెందిన ఎన్నారై ఖతర్‌లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అతడి దగ్గర డబ్బు కాజేయడానికి నలుగురు సభ్యుల ముఠా ప్లాన్ వేసింది. ఆ నలుగురిలో ఒక మహిళ కూడా ఉండటంతో ఆమె ఫేస్‌బుక్ ద్వారా ఎన్నారైకు దగ్గరైంది. కొద్ది రోజుల తర్వాత ఎన్నారైను తన ఫ్లాట్‌కు ఆహ్వానించింది. గదిలో కెమెరాలను ఏర్పాటు చేసిన గ్యాంగ్ సభ్యులు ఎన్నారై నగ్న ఫొటోలను తీశారు. ఎన్నారై కేరళ వచ్చిన సమయంలో నగ్న ఫొటోలను అతడికి పంపి రూ. 50 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫొటోలను బహిరంగ పరుస్తామంటూ బెదిరించారు. ఓ స్నేహితుడి సలహాతో ఎన్నారై కొచ్చి పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఖతర్‌లో ఉన్న తమ కాంటాక్ట్‌ల ద్వారా మహిళ, ఆమె స్నేహితుల గురించి ఆరా తీయించారు. వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లో కొంత డబ్బును డిపాజిట్ చేయగా.. ఆ డబ్బును కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న ఏటీఎంలో తెలియని వ్యక్తులు విత్‌డ్రా చేశారు. వారు కర్నాటకలో పట్టుబడగా.. వారి ద్వారా అసలైన ముఠాను పోలీసులు చేధించి ఖతర్ పోలీసులకు సమాచారమివ్వగా.. నలుగురిని ఖతర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నలుగురిలో ముగ్గురు కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన వారని.. మహిళ స్వస్థలం కొచ్చి అని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు కేరళకు చెందిన ఎంతో మంది ఎన్నారైలను ఈ ముఠా మోసం చేసి చాలా డబ్బును కాజేసిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితులు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారని.. వారి నుంచి చాలా నిజాలు రాబడుతున్నామని అధికారులు తెలిపారు.

Related posts