ఆస్ట్రేలియాలో మేల్ ఎస్కార్ట్‌గా పనిచేస్తున్న అలెక్స్ అనే 29 ఏళ్ల వ్యక్తి ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను బయటపెట్టాడు. కొంతమంది భర్తలే తమ భార్యలకు శారీరకంగా సుఖాన్ని ఇవ్వమని తనను బుక్ చేస్తున్నారంటూ తెలిపాడు. సహజంగా తాను గంటకు 500 డాలర్లు వసూలు చేస్తానని, ఒకరోజు తన వల్ల భార్య చాలా ఎంజాయ్ చేసిందని, ఓ భర్త వెయ్యి డాలర్ల టిప్పు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. చాలా మంది భర్తలు ఆఫీసు చికాకు వల్ల తమ భార్యలకు శారీరకంగా ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారని అలెక్స్ చెబుతున్నాడు. సహజంగా 35 నుంచి 45 వయసున్న మహిళలే తనను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని అలెక్స్ తెలిపాడు. బిడ్డల తల్లులు, వ్యాపారవేత్తలు, కాలేజీ అమ్మాయిలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ శారీరక సుఖం కోసం తనను సంప్రదిస్తున్నారని చెప్పాడు. సమయం, నిరాశ.. ఈ రెండు కారణాల వల్లే అమ్మాయిలు మేల్ ఎస్కార్ట్‌లను ఎంచుకుంటున్నారని అలెక్స్ చెబుతున్నాడు. జిన్ ట్రైనర్‌గా పనిచేసిన అలెక్స్ ఎస్కార్ట్ వృత్తి నచ్చడంతో ఇందులోకి వచ్చినట్టు, ఇందులో డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నట్టు చెప్పాడు. తాను ఓ వెబ్‌సైట్ తరపున పనిచేస్తున్నానని.. కంపెనీ నియమాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి టెస్ట్‌లు కూడా చేయించుకుంటున్నానని తెలిపాడు.
previous post