telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఫేక్‌ బ్యాంకు అకౌంట్ల కేసులో.. పాక్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

asif-ali-zardari pak

ఫేక్‌ బ్యాంకు అకౌంట్ల కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని సోమవారం అరెస్ట్ చేశారు. నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి రూ.30 మిలియన్లను జర్దారీ స్వీకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్యాంకు ఖాతాల కేసుతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టులో ఆయన ద‌ర‌ఖాస్తు చేయ‌గా కోర్టు దాన్ని తిరస్కరించడంతో అరెస్ట్ చేశారు.

ఈ కేసులో జర్దారీ సోదరి ఫర్యాల్ తల్పూర్ సహ నిందితురాలిగా ఉన్నారు. నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా రూ.4.4 బిలియ‌న్ల‌ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు మాజీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు.

Related posts