telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

పతంగుల షాపుల్లో అధికారుల తనిఖీలు

huge number of police in election duty
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ అధికారులు పట్టణంలోని పంతంగుల షాపుల పై తనిఖీలు నిర్వహించారు. సంక్రాతి సంబరాల్లో భాగంగా గాలి పటాలు ఎగురవేయడం ఆనవాయితీ. స్కూళ్లకు పండగ సెలవులు ప్రకటించడంతో చిన్న పెద్ద తేడా లేకుండా పంతంగులను కొనుగోలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పతంగుల ప్రత్యక దుకాణాలను వ్యాపారస్తులు ఏర్పాటు చేశారు. మరోవైపు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పర్యావరణానికి, పక్షులకు హానికలిగించే ప్లాస్టిక్‌, నైలాన్‌ చెనా మాంజాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు అటవీశాఖ అధికారులు ప్లాస్టిక్, నైలాన్ చైనా మాంజాల తయారీ, అమ్మకాలు చేయరాదని సూచించారు. వీటితోపాటు సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగుర వేసేందుకు పదునైన దారాలను వాడరాదని, గాజు, ఇనుము వంటి వస్తువులను దారాలకు కట్టి ఎగురవేయరాదని వ్యాపారులకు తెలిపారు. పర్యావరణానికి, పక్షులకు తీవ్రమైన హాని కలుగుతున్నదని పేర్కొన్నారు. నూలుపోగులతో తయారైన దారాలను మాత్రమే పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించాలని సూచించారు.

Related posts