telugu navyamedia
news political trending

పులికి .. కాపలాగా ఏనుగులు…

forest dept risks to save animals

పెద్ద పులికి కాపలా పెట్టాల్సిన అగత్యం పట్టింది మన జంతు సంరక్షణ శాఖలకు, అంత ఘోరంగా వేటగాళ్లు ఆయా జంతువులపై విరుచుకుపడుతున్నారు. ఇక జంతువులను చంపి తినే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. దీనితో వన్యప్రాణులను సంరక్షించడం ఆ శాఖకు పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. అందువలన వాటికీ రక్షణ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటనే అందుకు సాక్ష్యంగా ఉంది.. ఒడిశాలోని రాయగడ ఎన్‌క్లోజర్‌లో రెండు నెలలుగా బందీగా ఉన్న పెద్ద పులి సుందరికి త్వరలో విముక్తి లభించనుంది. దేశంలో పులల సంఖ్యను పెంచే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ నుంచి దీనిని తీసుకొచ్చి సాతోకోసియా అడవుల్లో విడిచిపెట్టారు. అయితే, సమీప గ్రామాలకు చెందిన ఇద్దరు గ్రామస్థులను సుందరి చంపి తినడంతో అటవీ అధికారులు దీనిని బంధించారు. పులిని బోనులో బంధించడంపై జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు తిరిగి దీనిని అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించారు.

గత రెండు నెలలుగా బోనులో బందీగా ఉన్న సుందరిని త్వరలోనే అనుగుల్ జిల్లాలోని సాతోకోసియా అడవుల్లో విడిచిపెట్టనున్నట్టు అటవీశాఖ మంత్రి బిజయ్‌శ్రీ రౌత్రాయ్ తెలిపారు. పులిని అడవిలో విడిచిపెట్టాక దానికి కాపలాగా రాజ్‌కుమార్, మహేంద్ర కాపలాగా ఉంటాయని పేర్కొన్నారు. అటవీ సిబ్బంది ఈ ఏనుగులపై సంచరిస్తూ సుందరిపై నిఘా పెడతారని మంత్రి వివరించారు.

Related posts

ఏపీలో జనాభా తగ్గుతోంది.. చంద్రబాబు ఆందోళన

ashok

నామినేషన్‌ దాఖలు చేసిన వైఎస్‌ జగన్‌

vimala p

త్వరలో హైటెక్‌సిటీ వరకు మెట్రో

ashok