telugu navyamedia
telugu cinema news trending

విశాల్ కోసం ర‌్యాప్ సింగ‌ర్‌గా రానా…!

Rana

విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “యాక్షన్‌”. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం టర్కీలో తెరకెక్కిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం సమకూర్చారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానరుపై రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. ఐశ్వర్యాలక్ష్మి, యోగిబాబులు ఇతర తారాగణం. ఫుల్‌ ప్యాకేజీ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. “యాక్ష‌న్” చిత్రం న‌వంబ‌ర్ 15న విడుద‌లవుతుంది. సుంద‌ర్.సి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కాగా… నటుడు, నిర్మాత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న రానా ఇప్పుడు మిత్రుడైన విశాల్ కోసం మ‌రో అవ‌తారం ఎత్తారు. ఇంత‌కు రానా ఎత్తిన అవ‌తారం ఏంటో తెలుసా? ర‌్యాప్ సింగ‌ర్‌గా. “యాక్ష‌న్” చిత్రం కోసం రానా త‌న గొంతు స‌వ‌రించుకున్నారు. హిప్ హాప్ సంగీతం అందించిన ఈ సినిమాలో “లైట్స్ కెమెరా యాక్ష‌న్‌…” అంటూ సాగే ఓ పాట‌ను తెలుగులో రానా పాడారు. “తొలిసారి రానా పాట పాడారు. ఎంతో అద్భుతంగా పాడారు. థ్యాంక్యూ రానా” అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిప్ హాప్ త‌మిళ మెసేజ్‌ను పోస్ట్ చేయ‌గా.. “నువ్వు లేక‌పోతే నేనీ సాహ‌సం చేసేవాడిని కాను. .. ధ‌న్య‌వాదాలు” అంటూ రానా రిప్లై ఇచ్చారు.

Related posts

వ్యాపారం కోసం .. సెలబ్రిటీ ఫోటోలు వాడితే.. జరిమానా.. !!

vimala p

“కౌన్ బనేగా కరోడ్‌పతి” షోలో ఐపీఎస్ అధికారి… గెలిచిన మొత్తాన్ని ఏం చేశారంటే ?

vimala p

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా మంచు విష్ణు వెబ్ సిరీస్

vimala p