telugu navyamedia
health trending

గుండె జబ్బులు రాకుండా.. ఇవే తినాలి.. !

ఒత్తిడి జీవితంతో ప్రపంచంలో ఏటా అనేక మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అందుకు అనేక కారణాలుంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ క్రమంలో అలా హార్ట్ ఎటాక్స్ రాకుండా, ఇతర గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కింద సూచించిన విధంగా పలు ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం..!

* చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.

* ఓట్స్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే ప్రమాదకర బైల్ యాసిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఓట్స్‌ను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

foods should take to overcome heart diseases* జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ గుప్పెడు మోతాదులో తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాలు వాపుకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

* రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించివేయడంలో పెసలు అమోఘమైన పాత్ర పోషిస్తాయి. నిత్యం పెసలను నానబెట్టుకుని, మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

* అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు వీటిలో ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. నీటిలో నానబెట్టుకుని లేదా పొడి చేసుకుని అవిసె గింజలను రోజూ తింటుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

* నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌లిపి అలాగే తినేయాలి. ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. వెల్లుల్లిని తీసుకుంటే ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

Related posts

ఆకట్టుకుంటున్న “దొరసాని” ట్రైలర్

vimala p

పశ్చిమ బెంగాల్ లో .. చంద్రబాబు ప్రచారం.. మమతపై ప్రశంసల వర్షం..

vimala p

నేటితో ముగుస్తున్న ప్రచారం.. ఆఖరి గంటలలో నేతలు ఎక్కడ..

vimala p