telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

షుగర్ ఉన్నవారు .. ఇవి తింటే సరి.. !

food items that diabetic should take

గత దశాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. స్థూల‌కాయం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వల్ల చాలా మందికి డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే దీనికి వైద్యులు సూచించిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం క‌లిగి ఉండాలి. నిత్యం వ్యాయామం చేస్తూ స‌మ‌యానికి భోజ‌నం చేయాలి. అలాగే భోజ‌నంలో కింద సూచించిన ఆహారాల‌ను భాగం చేసుకుంటే.. దాంతో డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే…

1. డ‌యాబెటిస్ ఉన్న‌వారు చేప‌ల‌ను బాగా తినాలి. వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు డ‌యాబెటిస్‌ను అదుపు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే శ‌రీరంలో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

2. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

3. డయాబెటిస్ ను న‌యం చేసే ఎన్నో ఔష‌ధ గుణాలు దాల్చిన చెక్క‌లో ఉంటాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో నిత్యం దాల్చిన చెక్క‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

4. డ‌యాబెటిస్ ఉన్న వారు నిత్యం 2 కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టుకుని తినాలి. ఇలా తింటే వారి శ‌రీరంలో కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

5. ప‌సుపులో ఉండే క‌ర్క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం డ‌యాబెటిస్ ను అదుపు చేస్తుంది.

6. బాదం పప్పు, జీడిప‌ప్పు, పిస్తా, వాల్‌న‌ట్స్‌ను నిత్యం తింటుంటే డ‌యాబెటిస్ అదుపులో ఉండ‌డ‌మే కాదు, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

7. అవిసె గింజ‌లు, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌, స్ట్రాబెర్రీలు, వెల్లుల్లి త‌దిత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటున్నా.. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

Related posts