telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠినచర్యలు!

food items

ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠినచర్యలు అమలు చేసేవిధంగా నిఘా సంస్థ పనిచేస్తుందని కేంద్ర ఆహారశాఖామంత్రి రామేశ్వర్‌ తెలిపారు.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 26 వేల కల్తీ ఆహార పదార్థాలను గుర్తించామని ఆయన రామేశ్వర్‌ వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఈ అంశంపై సమాధానం ఇచ్చారు. కల్తీ ఆహారపదార్థాలు ఉపయోగించినందుకు గానూ సదరు బాధ్యుల నుంచి రూ.32 కోట్ల జరిమానాను వసూలు చేసినట్లు తెలిపారు.

కల్తీ ఆహారపదార్థాలను ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో గుర్తించినట్టుగా వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోని ఆహారభద్రతా విభాగ అధికారులు తరచుగా తనిఖీలు చేస్తూనే ఉంటారని తెలిపారు. ఫిర్యాదులు అందినే వెంటనే విచారణ జరిపి కఠినచర్యలు తీసుకుంటునట్లు మంత్రి పేర్కొన్నారు.

Related posts