telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

మడతపెట్టి పక్కన పెట్టేసే… టీవీలు వచ్చేశాయి..

folding tv tech launched by lg

ఇప్పటికే ఫోల్డింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్ లోకి వచ్చేసింది.. ఇక ఇప్పుడు ఏకంగా ఫోల్డింగ్‌ టీవీ రానుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి సంస్థ ఎల్‌జీ 65 అంగుళాల(165 సెంటీమీటర్) 4కే సిగ్నేచర్‌ ఓఎల్‌డీ టీవీని రూపొందించింది. నెవడాలోని లాస్‌వెగాస్‌లో ఈనెల 8వ తేదీ నుంచి జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ప్రదర్శనలో కంపెనీ దీన్ని ఉంచింది. ఈ ఏడాది దీన్ని మార్కెట్‌లోకి తేనున్నట్లు ప్రకటించింది. దీనికి రోల్-అప్ మోడల్‌ కొత్త ఓఎల్‌ఈడీగా చెపుతోంది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనప్పుడు చుట్టచుట్టి పెట్టేయవచ్చు.

ఈ టీవీ కోసం 65 అంగుళాల తెరను ఎల్‌జీ రూపొందించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్‌ ఎయిర్‌ ప్లే సపోర్టు తోపాటు 100 వాల్ట్స్‌ డాల్బీ అట్మాస్‌ స్పీకర్‌ ఈ టీవీ ప్రత్యేకత అని సీనియర్ డైరెక్టర్ టిమ్ అలెస్సీ చెప్పారు. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్‌ఈడీ టీవీని కూడా కంపెనీ ఆవిష్కరిస్తుండడం విశేషం.

ఎల్జీ కంపెనీ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం నుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ వాస్తవ రూపం దాల్చిందని చెప్పారు. కాకుంటే ఈ టీవీ ధరను మాత్రం కంపెనీ బహిర్గతం చేయలేదు.

Related posts