telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ పై .. భారీ తగ్గింపు ధరలు..

fold-able samsung mobile with high discounts

ప్రస్తుతం భారతదేశం అంతటా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ (ఫస్ట్ ఫోన్) ఆఫ్‌లైన్ స్టోర్లలో రాయితీ ధర వద్ద అందించబడుతోంది. ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌లు గెలాక్సీ ఫోల్డ్‌ను 7,000 రూపాయల తగ్గింపుతో విక్రయిస్తున్నాయి. గెలాక్సీ ఫోల్డ్ గత నెలలో భారతదేశంలో రూ .1,64,999 ధరతో ప్రారంభించబడిన సంగతి అందరికీ విదితమే. 7,000 రూపాయల తగ్గింపుతో, ఫోల్డ్ ధర 1,57,999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ ధర వద్ద ఇప్పటికీ ఫోన్‌ను వినియోగదారులను ఎక్కడా దగ్గరగా చేయదు, కానీ ఫోన్‌ను కొనడానికి ఆసక్తి ఉన్నవారు మొదట ఆఫ్‌లైన్ స్టోర్లను చూడండి. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గత నెల నుండి అన్ని స్టోర్స్‌లో మరియు ఆన్‌లైన్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.మడతబెట్టి జేబులో పెట్టుకోవచ్చు.

ఈ ఫోన్‌లో రెండు తెరలు ఉంటాయి. ఒక డిస్‌ప్లే 7.3 ఇంచ్ సైజ్ కాగా, మరో డిస్‌ప్లే సైజ్ 4.6 ఇంచులుగా ఉంది. కాగా 7.3 ఇంచుల డిస్‌ప్లేను మడతబెట్టే విధంగా రూపొందించారు.కాగా ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను తయారు చేసేందుకు భిన్న రకాల కాంపొనెంట్లను తయారు చేయాల్సి వచ్చిందని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్‌ను ఎంచక్కా పాకెట్ సైజ్ కు మడతబెట్టి జేబులో పెట్టుకోవచ్చని ఆ కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 7.3 ఇంచుల ఇన్పినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 4380 ఎంఏహెచ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌లో ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ లేదు.

ఇందులో వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్సల్ కవర్ కెమెరా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఎలా పట్టుకున్నా చాలా వేగంగా కెమెరాను ఓపెన్‌ చేసి ఫొటోలు తీసుకునే సౌకర్యం కల్పించారు. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ లో ఆండ్రాయిడ్ పై 9.0 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఒకేసారి మూడు యాప్ లను ఈ ఫోన్ డిస్‌ప్లేలపై రన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్‌, యూట్యూబ్ తదితర సోషల్ యాప్స్‌ను ఇందులో ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఫోన్ కోసమే ప్రత్యేకంగా ఈ యాప్‌లను భిన్న రకాల్లో డిజైన్ చేశారు. కాగా షియోమీ, లెనోవో, ఎల్‌జీ కంపెనీలు కూడా మడతబెట్టే ఫోన్లను రూపొందించే పనిలో ఇప్పటికే నిమగ్నం కాగా, శాంసంగ్ మాత్రం ఈ ఫోన్‌ను విడుదల చేసి ఆ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిందనే చెప్పవచ్చు..!

Related posts