telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్మీ సంక్షేమ నిధికి ఎఫ్.ఎన్.సి.సి ఐదు లక్షలు విరాళం

FNCC (1)

దేశ రక్షణ నిధి కోసం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఐదు లక్షల రూపాయల చెక్కును మేజర్ జనరల్ శ్రీ ఎన్.ఎస్ రావు గారికి అందసేసినట్టు అధ్యక్షుడు డాక్టర్ కె.ఎల్. నారాయణ తెలిపారు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించే సైనికుల కోసం ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ కోసం తాము ఈ విరాళాన్ని అందించినట్టు నారాయణ చెప్పారు.
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తరుపున మేజర్ జనరల్ శ్రీ ఎన్.ఎస్ రావు గారిని కలసి చెక్కు అందించామని, ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి.రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి తుమ్మల రంగారావు పాల్గొన్నారని నారాయణ చెప్పారు.

FNCC
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తరుపున అనేక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిలిం నగర్ లోని ఓ స్కూల్ దత్తత తీసుకొని అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని నారాయణ తెలిపారు.
ఫిలిం నగర్ లో నివసించే వారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి మూడు నెలలలకు ఒకసారి అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, రెండు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్ధిక సహాయాన్ని కూడా అందిస్తున్నామని తుమ్మల రంగారావు చెప్పారు.

Related posts