telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

విజయవాడ : .. ఆ ఫ్లై ఓవర్‌ను రెండు రోజుల పాటు మూసివేత …

flyover closed for 2 days on maintenance

రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ను మరమ్మతుల నిమిత్తం రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. శని, ఆదివారాల్లో పలు మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో వాహనాలను దారి మళ్లించనున్నారు. కొద్ది రోజుల కిందట రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ పేవ్‌మెంట్‌ను ఓ కారు ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ డ్యామేజీ ఏర్పడింది.

సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో రెండు రోజుల పాటు ఫ్లై ఓవర్‌కు మరమ్మతులు నిర్వహిస్తారు. కీలకమైన ఈ ఫ్లై ఓవర్‌ మూసివేతతో రెండు రోజుల పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పేలా లేవు. హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. ఈ రెండు రోజుల పాటు దెబ్బతిన్న పేవ్‌మెంట్‌తో పాటు సెక్యూరిటీ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.

Related posts