telugu navyamedia
culture news trending

ఇంట్లోకి దూసుకొచ్చిన దొంగకు ఝలక్ ఇచ్చిన మహిళ… ఏం చేసిందంటే ?

Arrest

అలైస్ కోల్‌మాన్ (61) అనే మహిళ ఫ్లోరిడాలోని తన అపార్ట్‌మెంట్‌లో నిద్రపోతోంది. తెల్లవారుజామున ఫైర్ అలార్మ్ మోగుతున్న శబ్దం రావడంతో.. ఏంటో చూడటానికి ఇంటి తలుపు తీసింది. అంతే.. మోర్టన్ అనే వ్యక్తి ఒక్కసారిగా ఆమెను తోసుకుంటూ ఇంట్లోకి దూసుకొచ్చాడు. ‘ఏం కాదు మామా.. అంతా బాగానే ఉంటుంది’ అని మహిళను బెదిరించడం మొదలుపెట్టాడు. దీనికి భయపడని అలైస్ ‘అంతా బాగానే ఉండదు.. ముందు నా ఇంటి నుంచి బయటకు వెళ్లు. నేను నీ మామా కాదు. నేను ఎవరో నీకు తెలియదు’ అంటూ రివర్స్ పంచ్ ఇచ్చింది. అంతేకాకుండా అరిగిపోయిన పళ్లతోనే అతడిని కొరికేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో మోర్టన్ ఇంటి తలుపులు వేసి లాక్ చేసుకున్నాడు. అలైస్ వెంటనే ఇంటి బయట కూడా తలుపులు వేసేసి ఇంటి పక్కన ఉన్న వాళ్ల వద్దకు వెళ్లి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టగానే మోర్టన్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక నుంచి తలుపు తీసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు పోలీసులు.

Related posts

లేఖలో ఉన్న చేతిరాత వివేకాదే..అంగీకరించిన కుమార్తె సునీత: కడప ఎస్పీ

vimala p

“ఎఫ్2” సీక్వెల్ లో వెంకీ పాత్రలో మరో హీరో…!?

vimala p

రానున్న ఎన్నికల అనంతరం.. అమరావతిలో పవన్ ప్రమాణస్వీకారం.. : జనసేన

vimala p