telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడని… ఆమె ఏం చేసిందంటే ?

Florida

బాయ్‌ఫ్రెండ్ ఇంటికి నిప్పంటించిన ఓ మహిళను ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 7వ తేదీన పెన్సాకోలా నగరంలో ఓ ఇల్లు కాలిపోతుందంటూ స్థానికులు సమాచారమివ్వడంతో.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు. మూర్(47) అనే మహిళ అదే ఇంటి ముందు నిలబడి.. తానే నిప్పంటించినట్టు పోలీసులకు తెలిపింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి విచారించగా.. తాను కూడా అదే ఇంట్లో ఉండేదాన్ని అని.. నెలరోజుల క్రితం ఖాళీ చేసినట్టు పేర్కొంది. తన బాయ్‌ఫ్రెండ్ మరో మహిళను ఇంటికి తీసుకురావడంతోనే తాను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు మూర్ వివరించింది. బాయ్‌ఫ్రెండ్ చేసిన మోసాన్ని భరించలేక తాను ఇంటికి నిప్పంటించినట్టు నేరాన్ని అంగీకరించింది. నవంబర్ 7వ తేదీన మూర్ తమ ఇంటికి వచ్చి పెట్రోల్ అడిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మూర్ పెట్రోల్ తీసుకుని తన బాయ్‌ఫ్రెండ్ ఇంటి వెనుకకు వెళ్లిందని.. అనంతరం కిటికిలో నుంచి ఇంటి లోపలకు పెట్రోల్ పోసి నిప్పంటించిందని స్థానికులు చెప్పారు. కాగా, నిప్పంటించిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఉంటే వారు ప్రాణాలతోనే ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Related posts