telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆన్లైన్ లో భారీ మోసం… జానెడు స్థలానికి 6 లక్షలకు…!?

Florida

అమెరికాలో 9100 డాలర్ల (రూ. 6 లక్షల 35 వేలు)కే ఇళ్లంటూ ఆన్‌లైన్‌లో విల్లా ఫొటోలను పెట్టి వేలం వేశాడు. అది చూసిన కెర్విల్లే హోల్‌నెస్ అనే వ్యక్తి చవగ్గా దొరుకుతోందనే ఆశతో కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే కొనేశాడు. కొన్న తరువాతే తెలిసింది తాను నిజానికి కొనింది విల్లా కాదు ఇంటి బయట ఉన్న 1/100 ఫుట్ స్ట్రిప్ భూమిని మాత్రమేనని. రెండు ఇళ్లను వేరుచేస్తూ మధ్యలో ఉన్న ఓ జానడు స్థలాన్ని రూ. 6 లక్షలు పెట్టి కొన్నానని, తాను మోసపోయానని గ్రహించాడు. కెర్విల్లే కొన్న స్థలం విలువ 50 డాలర్లు (రూ. 3500) మాత్రమే… కానీ ఆన్‌లైన్‌లో లక్షా 77 వేల డాలర్ల (రూ.కోటి 23 లక్షల 56 వేలు) విలువ చూపించారని, పైగా విల్లా ఫొటోలు కూడా పెట్టడంతో ఆలోచించకుండానే తాను కొన్నానని, ఇప్పుడు తన డబ్బు వెనక్కు ఇవ్వమన్నా వాళ్ళు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు. ముందే ఆలోచించాలి… ఇప్పుడిలా ఆవేదన చెందితే ఏం లాభం.

Related posts