telugu navyamedia
crime culture news trending

తాగిన మత్తులో మొసలితో యువకుల వికృత చేష్టలు

Alligator

తిమోతి కెప్కే (27), నోహ్ ఒస్బోర్న్ (22) అనే ఇద్దరు యువకులు ఫ్లోరిడాలోని పామ్ సిటీలో ఆగస్టు 26న రోడ్డు పక్కన ఓ మొసలి కనిపించడంతో పట్టుకున్నారు. అనంతరం దానిపై వికృత చర్యకు పాల్పడ్డారు. తాగిన మైకంలో ఉన్న వారిద్దరూ మొసలికి బీరు పట్టించారు. ఆ సమయంలో కెప్కే చేతిని మొసలి గాయపరించిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అంతర్జాలంలో చూసిన ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు వీడియోలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. మొదట కెప్కే ఇంటికి వెళ్లిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడి సమాచారంతో వీడియోలో ఉన్న ఒస్బోర్న్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై అక్టోబర్ 3న మూగజీవిని హింసించడం కింద కేసు మోదు చేసి మార్టిన్ కౌంటీ జైలుకు తరలించారు. అయితే బెయిల్‌పై వారిద్దరు అదే రోజు విడుదలయ్యారు.

Related posts

అద్వానీ వ్యాఖ్యలు మోడీ గురించే: చంద్రబాబు

vimala p

దేశంలోనే ధనిక .. ఎంపీ .. కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్..

vimala p

ధనవంతుల భద్రత ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మీరు చూడండి.

ashok